Homeహైదరాబాద్latest NewsSHOCKING: మామతో కలిసి భర్తను హతమార్చిన భార్య

SHOCKING: మామతో కలిసి భర్తను హతమార్చిన భార్య

విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ మామతో కలిసి భర్తను హతమార్చింది.. ఈ ఘటన సంచలనంగా మారింది. భర్త వేధింపులు తట్టుకోలేని ఓ భార్య తన మామ సహకారంతో అతడిని కిరాతంగా హత్య చేసింది. తాగొచ్చి నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో విచక్షణ కోల్పోయి అతడిని అంతమెుందించింది. వెదుళ్లవలసకు చెందిన కొలుసు అప్పన్న, దేవి ఇద్దరు భార్యాభర్తలు. తాగుడుకు బానిసైన అప్పన్న తరచూ భార్యను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవాడు. ఆమెపై అనుమానంతో వేధింపులకు పాల్పడేవాడు. శుక్రవారం ఇంటికి తాగి వచ్చిన భర్తతో గొడవకు దిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండడంతో విసుగుచెందింది. క్షణికావేషానికి లోనై తాగొచ్చి గొడవ చేస్తున్న భర్తను ఉరేసి భార్య దేవి హత్య చేసింది. ఈ హత్యకు మామ ముంత సన్యాసిరావు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img