Homeహైదరాబాద్latest Newsసమంతతో షూటింగ్..శోభితతో డేటింగ్..నాగ చైతన్య విడాకులకు అసలు కారణం అదేనా..?

సమంతతో షూటింగ్..శోభితతో డేటింగ్..నాగ చైతన్య విడాకులకు అసలు కారణం అదేనా..?

అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులకు అసలు కారణం శోభిత అనే వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది.దీనికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. శోభిత ఎంట్రీ ఇవ్వడంతో సమంతను నాగ చైతన్య దూరం చేసుకున్నడు అని తెలుస్తుంది. నాగ చైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న సమయంలో సమంతతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూని చూసిన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా సూపర్ జోడీ అంటూ వ్యాఖ్యానించారు. వీరిద్దరూ 2021లో విడాకులు ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. విడాకులు తీసుకున్న కొద్ది రోజుల్లోనే నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మధ్య సంబంధంపై పుకార్లు షికారు చేయడం ప్రారంభించాయి. ఈ పుకార్లు నిజమని తేలింది. వీరిద్దరూ డిసెంబర్‌లో కొందరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
నాగ చైతన్య, సమంత జంటగా శోభిత కూడా సినిమాలో పని చేసిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి ‘మజిలీ’ సినిమాలో పనిచేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య తొలి ప్రేమ దివ్యాంశ్ కౌశిక్ కూడా నటించింది. అయితే ఈ పాత్రకు దివ్యాన్ష్ కంటే ముందు శోభితా ధూళిపాళను దర్శకుడు శివ నిర్వాణ ఎంపిక చేశారు. అంతే కాకుండా కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే కొన్ని కారణాల వల్ల శోభితను ఈ పాత్ర నుంచి తప్పించారని అంటున్నారు. ఈ వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. షూటింగ్ సమయంలో శోభిత, నాగ చైతన్య సన్నిహితంగా ఉండేవారు అని వార్తలు వచ్చాయి. శోభిత-నాగ చైతన్యల అనుబంధమే విడాకుల వరకు దారి తీసిందని నెటిజన్లు అంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందొ అని తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img