Homeహైదరాబాద్latest Newsరాష్ట్రంలో బస్సు డ్రైవర్ల కొరత.. సరికొత్తగా టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్లు నియమికం..!

రాష్ట్రంలో బస్సు డ్రైవర్ల కొరత.. సరికొత్తగా టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్లు నియమికం..!

రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తాయి. దీంతో ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. దీంతో టీజీఎస్ఆర్టీసీ అన్ని జిల్లాల రూట్లలో ఈ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసు అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్ల కొరత సమస్య ఏర్పడింది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందరూ నడపలేరు. అనుభవజ్ఞులైన డ్రైవర్లు మాత్రమే వాటిని నడపగలరు. దీంతో బస్సు డ్రైవర్ల అవసరం భారీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు సరికొత్తగా ఆలోచించారు. మనం మాల్స్‌లో హెల్పర్లు కావాలి, సేల్స్ బాయ్స్ కావాలి అనే బోర్డులు అక్కడక్కడా చూస్తాం. అయితే సరిగ్గా ఇదే తరహాలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో టీజీఎస్ఆర్టీసీ అధికారులు డ్రైవర్లను కోరుతూ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేశారు. ‘డ్రైవర్లు కావలెను’ అనే ప్రకటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img