Homeలైఫ్‌స్టైల్‌Should not Combine Curd with these Foods : ఈ పదార్థాలు పెరుగుతో కలిపి...

Should not Combine Curd with these Foods : ఈ పదార్థాలు పెరుగుతో కలిపి తినకూడదు

should not combine curd with these foods | మనలో పెరుగంటే ఇష్టం లేనిది ఎవరికి? భోజనం ముగించే ముందు పెరుగన్నం కలుపుకుని తినడం తెలుగిళ్లల్లో సర్వ సాధారణం.

కొందరు పెరుగును ఊరికే తింటుంటారు. లేదా లస్సీ రూపంలో, మజ్జిగ రూపంలో తీసుకుంటారు.

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణశక్తిని మెరుగుపర్చి ఉష్ణాన్ని తగ్గిస్తాయి.

అందుకే పెరుగు తింటే కడుపు చల్లగా ఉంటుంది అంటారు. అయినా పెరుగుతో కలిపి తినగూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి.

ఉల్లిగ‌డ్డ

చాలామందికి పెరుగ‌న్నంలో ఉల్లిగ‌డ్డ ముక్క‌ల‌ను క‌లిపి తిన‌డం అల‌వాటు ఉంటుంది.

ఇలా పెరుగులో ఉల్లిపాయ ముక్క‌లు నంజుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో.. ఆరోగ్యానికి డేంజ‌ర్ కూడా అంతే ఉంటుంది.

అదేంటి అనుకుంటున్నారా? ఆయుర్వేదంలో దీనికి కార‌ణం కూడా ఉంటుంది. అదేంటంటే.. పెరుగు శ‌రీరంలో చ‌ల్ల‌ద‌నం పెంచుతుంది.

అదే ఉల్లిగ‌డ్డ‌తో వేడి పెరుగుతుంది. కాబ‌ట్టి ఈ రెండింటినీ క‌లిపి తింటే అల‌ర్జీలు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.

ద‌ద్దుర్లు, తామ‌ర‌, సోరియాసిస్‌, గ్యాస్ట్రిక్‌, వాంతులు వంటి అనారోగ్య‌ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

పెరుగు తిన్న వెంటనే మినపపప్పుతో చేసిన, నూనెలో దేవిన లేదా వెన్న, నెయ్యి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు.

దీనివల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం కలుగుతుంది.

చేపలు

పెరుగు, చేపలు కలిపి తినగూడదనేది పెద్దలు చెప్పిన మరో మంచిమాట. దీనికీ కారణం లేకపోలేదు.

మాంసకృత్తులు అధికంగా ఉండే రెండు రకాల పదార్థాలు ఒకేసారి తినరాదని ఆయుర్వేదం చెప్తున్నది.

ఈ రెండూ అధిక ప్రొటీన్లు కలిగినవే. కలిపి తింటే అజీర్ణంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి.

పాలు

పెరుగుతో పాటు పాల‌ను క‌లిపి కూడా తిన‌డం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

అదేంటి మీకేమైనా పిచ్చా? పాల నుంచే పెరుగు వ‌స్తుంది క‌దా.. రెండింటినీ క‌లిపి తింటే ఏమ‌వుతుంద‌ని కోప‌మొస్తుంది క‌దూ..

కానీ ఈ రెండింటినీ క‌లిపి తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే.. పెరుగు పులిసింది..

కానీ పానీ పులియ‌న‌వి.. కాబ‌ట్టి ఈ రెండింటినీ ఏక‌కాలంలో తీసుకుంటే.. ఎసిడిటీ, అతిసారం, క‌డుపునొప్పి, అజీర్తి వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.

మామిడి పండు

ఇక చివరగా మామిడి పండుతో పెరుగు తీసుకోవడం. ఇది వినడానికి, తినడానికి బాగుంటుంది.

కానీ పెరుగు తిన్న వెంటనే లేదా పెరుగుతోపాటే మామిడి తీసుకుంటే శరీరంలో విషపదార్థాలు పెరుగుతాయి. ఫలితంగా ఎలర్జీలు, చర్మ సమస్యలు రావచ్చు.

Recent

- Advertisment -spot_img