Homeరాజకీయాలురాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దా?

రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దా?

– బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులు చేయిస్తున్నయ్
– పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి

ఇదే నిజం, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.‘రాజ్యాంగబద్ధ సంస్థలను మోడీ, కేసీఆర్‌ పావులుగా మార్చుకున్నారు. కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ ఐటీ, ఈడీ దాడులు పెరుగుతున్నాయి. ప్రజల తరఫున పోరాడితే ద్రోహులా? భాజపా, బీఆర్ఎస్​లో చేరిన వాళ్లు పవిత్రులా? రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను ఈసీ కాపాడాలి. వివేక్‌ కుటుంబంపై జరిగిన దాడి కాంగ్రెస్‌పై జరిగినట్లే భావిస్తాం’అని రేవంత్‌ పేర్కొన్నారు. మరోవైపు అలంపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహం శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌.. అబ్రహానికికు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Recent

- Advertisment -spot_img