ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా? లేక ఈవ్‌నింగ్ చేస్తే మంచిదా? అని ఎప్పైడైనా ఆలోచించరా? ఇదే విషయాన్ని డాక్టర్లను అడిగితే వాకింగ్ ఏ సమయంలో చేసినా మంచిదే అని చెబుతున్నారు. పొద్దున్నే వాకింగ్ చేస్తే మైండ్‌సెట్ పాజిటివ్‌గా ఉంటుందని, రోజంతా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయని అదే సాయంత్రం వాకింగ్ చేస్తే రాత్రి హాయిగా నిద్రపడుతుందని వివరిస్తున్నారు.