అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారిగా శ్రీరామనవమి జరుపుకుంటున్నందుకు దేశప్రజలకు ప్రధాని మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని వందల సంత్సరాల నుంచి దేశ ప్రజలు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారని X వేదికగా పేర్కొన్నారు. రాముని దీవెనలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సుఖసంతోషాలు, తెలివి, ధైర్యసాహసాలు సమృద్ధిగా లభించాలని ఆయన కోరుకున్నారు.