అడివి శేష్ హీరోగా ‘డెకోయిట్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మొదటిగా అడివి శేష్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నేడు అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అడివి శేష్ పక్కన మరో హీరోయిన్ మాస్క్ ధరించి తుపాకీ పట్టుకుని కనిపించింది. దీంతో శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ పోస్టర్‌లో హీరోయిన్ ఎవరనే చర్చ సాగుతోంది. ఆ హీరోయిన్ ఎవరనేది రేపు విడుదల కానున్న పోస్టర్ లో క్లారిటీ రానుంది.