Shruti Haasan : కమల్ హసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ (Shruti Haasan) కొద్దీ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొదటిగా శృతి హాసన్ 2009లో ”లక్” అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత 2011లో ”అనగనగా ఓ ధీరుడు” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. అయితే శృతి హాసన్ సినిమాలు కంటే ఎక్కువగా ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచేది. గతంలో శృతిహాసన్ ముగ్గురుతో బ్రేకప్ చేసుకుంది. తాజాగా శృతి హాసన్ మరోసారి ప్రేమలో పడింది అని తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ప్రేమలో ఉంది అని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం లోకేష్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఉన్నాడు. అతని కోసం స్టార్ హీరోలు సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నారు.
అయితే లోకేష్ కమల్ హసన్ తో ”విక్రమ్” అనే సినిమా చేసాడు. ఆ సినిమా కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ క్రమంలోనే ఆ సినిమా షూటింగ్ సమయంలో లోకేష్ – శృతి హాసన్ మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తుంది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసారు. ఆ సాంగ్ లో లోకేష్ – శృతి హాసన్ రొమాన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో ”కూలి” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో లోకేష్ కావాలనే శృతి ని హీరోయినిగా ఎంపిక చేసాడు. వీరిద్దరూ ప్రస్తుతం పీకల్లోతులో ప్రేమలో ఉన్నారు అని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని సమాచారం. వీరి పెళ్లికి కమల్ హాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది. అయితే లోకేష్ కి ఇప్పటికే పెళ్లియి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శృతి హాసన్ కోసం తన భార్యకి విడాకులు ఇవ్వడానికి లోకేష్ రెడీగా ఉన్నాడు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్, శృతి హాసన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని తెలుస్తుంది.