ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్ లతో ఎస్సై గణేష్ ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించారు. అలాగే మండల ప్యాసింజర్ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ.. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గణేష్, కానిస్టేబుల్ కాసిం శ్రీనివాస్, హోంగార్డు వెంకట్ సిబ్బంది మనోహర్ తో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.