ఇదే నిజం జనవరి 8 బెల్లంపల్లి : రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ పర్యవేక్షణలో, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ సూచనల మేరకు బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని సెంట్ మేరీ హై స్కూల్ లో సైబర్ జాగృత దివాస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాల ద్వారా జరుగుతున్న వివిధ మోసాలను గురించి విద్యార్థులకు అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫ్జలుద్దిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు వివరించాలని అన్నారు. మన బలహీనతనే సైబర్ నేరగాళ్ల బలం అని, తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవడం, మన ప్రమేయం లేకుండా వచ్చే ఓటిపి షేర్ చేయడం, ఆన్లైన్ లో ఉద్యోగాల కోసం వెతకడం, ఆన్లైన్ కస్టమర్ కేర్ నంబర్స్ వెతకడం, మొబైల్ ఫోన్ కి వచ్చే అనుమానిత లింక్స్ పేరుతో ఎరవేసి క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బులను ఊడ్చేస్తారని, ఇలాంటి సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇట్టి సైబర్ మోసాల పట్ల విద్యార్థులు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల పై, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండాతీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థి, విద్యార్థినులకుసూచించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ ఏరియాలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు.
- లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
- కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
3.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు. - లాటరీ ఆఫర్లంటలు వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.5.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు. వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
6 యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు. - ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
- పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
9.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి అని తెలిపారు.ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ ఐ మహేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.