Homeహైదరాబాద్latest NewsSiddhu : సిద్దు ట్రాక్ మార్చాలి.. లేకపోతే కష్టమే..!!

Siddhu : సిద్దు ట్రాక్ మార్చాలి.. లేకపోతే కష్టమే..!!

Siddhu : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ”DJ టిల్లు” సినిమాల హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ”జాక్” అనే సినిమాలో సిద్దు నటించాడు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య సిద్దు సరసన నటించింది. ఈ సినిమా ట్రైలర్ బాగుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నేడు (ఏప్రిల్ 10న) విడుదలైంది. అయితే ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ప్రేక్షకులను నిరాశపరిచాడు అనే చెప్పాలి. ఈ సినిమా స్టోరీ లైన్ బాగున్నా కానీ దాన్ని తెరపై తీయడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. ఈ సినిమాకు మేజర్ బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే సిద్దు క్యారెక్టర్.. కొన్ని చోట్ల బాగున్నా.. మిగతా అన్ని చోట్ల DJ టిల్లు లా ఉంటుంది. ఈ సినిమాలో సిద్దు ‘రా’లో స్పై ఏజెంట్‌గా మారాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ కానీ ఎక్కడా ఆలా అనిపించదు. కేవలం కామెడీ సీన్స్, వన్-లైనర్‌ పంచ్లతో స్క్రీన్ ప్లే ను ముందుకు సాగించారు. సిద్దు జొన్నలగడ్డ ఇకపై ఆయనా ”DJ టిల్లు” లాంటి సినిమాలు నుండి బయటికి వచ్చి కొత్త సినిమాలు కొత్త తరహాలో యాక్టింగ్ చేయడం మంచింది.

Recent

- Advertisment -spot_img