సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి (Siddipet Collector) సంచలన నిర్ణయం తీసుకున్నారు. BRS Candidate సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన సభకు హాజరై, ఎన్నికల కోడ్ (Election Code)ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7వ తేదీ సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో వెంకట్రామిరెడ్డి సభ ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్న బీజేపీ నాయకులు, వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. BJP candidate Raghunandan Rao సీఈవో వికాస్ రాజ్(CEO Vikas Raj) కు ఆధారాలలో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరిని సీఈవో ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేసిన కలెక్టర్ 106 మంది ప్రభుత్వ సిబ్బంది ఈ సభలో పాల్గొన్నారని గుర్తించారు. ఆ 106 మందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ (Siddipet Govt Staff Suspended)చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి తెలంగాణలో రూ. 71 కోట్ల నగదు, వస్తువుల పట్టివేత