సిక్కులు తప్పనిసరిగా ఐదుగురు పిల్లలను కనాలని దామ్‌దామి తక్సల్ ఖల్సా సిక్కు సంస్థ చీఫ్ బాబా హర్నామ్ సింగ్ ఖల్సా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిక్కులు బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉండటానికి తప్పనిసరిగా ఐదుగురు పిల్నల్ని కనాలని సూచించారు. మరింత పెద్ద కుటుంబాలకు మద్దతునిస్తూ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి పిల్లలను పెంచడంలో దామ్‌దామి తక్సల్ సహాయపడుతుందని తెలిపారు. వారికి తగిన ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు.