వెండి, బంగారం ‘నువ్వా నేనా’ అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బంగారం ఆల్‌టైమ్ హైకి చేరుకోగా.. కిలో వెండి ఏకంగా లక్ష దాటేసింది. ఏడాది క్రితం కిలో వెండి ధర రూ.50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.1,00,000 దాటింది. దాంతో వెండి కూడా బంగారమైంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే భయపడే జనాలు.. ఇప్పుడు వెండి అన్నా కూడా బెంబేలెత్తిపోతున్నారు. హైదారాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు (జులై 17) రూ.1,00,500గా ఉంది. బంగారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980 పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,750గా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,000గా ఉంది.