హైదరాబాద్ తరహాలో జిల్లాల్లో సైతం కట్టడాల కూల్చివేత ప్రక్రియ ఊపందుకున్నది. నిన్న, మొన్నటి వరకు నగరంలో అమానవీయంగా నిరుపేదల ఇండ్లను కూల్చివేసిన ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల్లో సైతం దూకుడు పెంచింది. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను అధికారులు కూల్చివేశారు. ఆస్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడుతామని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.