Singanamala Ramesh Babu : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో ”ఖలేజా”, ”కొమరం పులి” సినిమాలు నిర్మించి 100 కోట్లు నష్టపోయాను అని నిర్మాత సింగనమల రమేష్ బాబు అన్నారు. ఆ సినిమాలతో చాలా నష్టపోయాను కానీ ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు అని వెల్లడించారు. ”కొమరం పులి” సినిమా తీసే సమయంలోనే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో తిరగడంతో ఆ సినిమా కొంచెం డిస్టర్బ్ అయింది అని అన్నారు. అలానే మహేష్ బాబు తో తీసిన ”ఖలేజా” మూవీ కూడా అనేక కారణాలతో ఆలస్యమైందని నిర్మాత తెలిపారు. ఇప్పటివరకు నన్ను ఎలా ఉన్నావు ? నీ సమస్య ఏంటి అని ఎవరూ అడిగిన పాపాన పోలేదు అని పేర్కొన్నారు. 24 క్రాఫ్ట్స్ పై గ్రిప్ ఉంటేనే సినిమా తీయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవడం బెట్టర్ అని నిర్మాత సింగనమల రమేష్ బాబు అన్నారు.