Homeహైదరాబాద్latest Newsసూపర్, ఉద్యోగులకు 8 నెల్ల జీతం బోనస్

సూపర్, ఉద్యోగులకు 8 నెల్ల జీతం బోనస్

సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లోంచి ఎంప్లాయీస్‌కు 8 నెలల జీతాన్ని బొనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రికార్డు స్థాయిలో 1.98 బిలియన్‌ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేసింది. మార్చి ముగిసేనాటికి కంపెనీ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత సంవత్సరంలో ఏకంగా 36.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు తెలిపింది. కరోనా కాలంలో ఎయిర్‌లైన్స్ నష్టాల్లోకి జారుకున్నా తర్వాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ దేశాల సరిహద్దులు తెరుచుకోవడమే లాభాలకు ప్రధాన కారణమని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Recent

- Advertisment -spot_img