ఇదే నిజం, జనవరి 7 బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ ఏరియా మెయిన్ రోడ్ పై సింగరేణి రిటైర్డ్ కార్మికులు, కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి క్వార్టర్స్లో ఉంటూ జీవనం సాగిస్తున్న తమకు కరెంట్ నిలిపివేయడం సరికాదని మండిపడ్డారు. వెంటనే సింగరేణి యాజమాన్యం కలగజేసుకొని కరెంట్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కన్నాల బస్తికి చెందిన మల్లమ్మ మాట్లాడుతూ, తన భర్త సింగరేణి లో పనిచేసే రిటైర్డ్ అయ్యారని ఇప్పుడేమో, రిటైర్ అయిన కార్మికుని ఇంటికి కరెంటు కట్ కట్ చేయడంతో చీకటితో ఇబ్బందులు పడుతున్నామన్నారు తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే తమ సమస్యలను తీర్చాలని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి కరెంట్ మళ్లీ తమకు ఇప్పించాలని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రజలు వివిధ పార్టీకి చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.