టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తెలియని వారు ఉండరు. ఆమె 42 ఏళ్ల వయసులో వ్యాపారవేత్త రామ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక సునీత ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. పిల్లలు ఎదిగాక కూడా.. పెళ్లి అవసరమా? అంటూ ఆమెను పలు రకాలుగా ట్రోల్స్ చేశారు. అయినప్పటికీ సునీత అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది.
అయితే రామ్‌ను పెళ్లి చేసుకుని, మూడేళ్లైన సందర్భంగా సునీత సోషల్ మీడియా వేదికగా రామ్ తాళి కడుతున్న ఫోటో షేర్ చేసింది. ‘‘ఈ క్షణం నా జీవితం సంతోషమయంగా మార్చేసిందని’’ ఫొటో కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సింగర్ సునీత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.