Homeతెలంగాణ4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి

4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
హైద‌రాబాద్ః కేంద్రం నుంచి ఇంకా 4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వెల్ల‌డించారు. ఆగస్టు నెలాఖరు నాటికి రావాల్సిన బకాయి 2.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉంద‌న్నారు. 2020 – 21 వానాకాలానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం కేటాయించింది 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 11.80 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులతో కలిపి మొత్తం 22.30 లక్షల మెట్రిక్ టన్నులు అయ్యింద‌న్నారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులను అంచనా వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంతో స్వయంగా మాట్లాడార‌ని మంత్రి గుర్తుచేశారు. తాను వ్యవసాయ శాఖ కార్యదర్శితో కలిసి రెండు సార్లు ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాం, పలు మార్లు ఈ విషయంలో లేఖలు రాయడం జరిగిందన్నారు. ఇతర ఎరువుల విషయంలో ఎలాంటి సమస్య లేదని, – యూరియా సరఫరాలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 31 వరకు స్వయం కేంద్రం చేసిన కేటాయింపులు 8.69 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఆగస్టు 31 నాటికి వాస్తవంగా సరఫరా చేసింది 6.15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్ర‌మేన‌న్నారు. సెప్టెంబరు నెల కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిందిన్నారు. సెప్టెంబరు 30, 2020 ఈ వానాకాలం సీజన్ ముగిసే నాటికి రావాల్సిన బకాయి 2.54 లక్షల మెట్రిక్ టన్నులతో పాటు సెప్టెంబర్ నెల కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి కేంద్రం నుండి ఇంకా 4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు. గత ఏడాది వానాకాలం సీజన్ లో తెలంగాణలో కోటీ 3 లక్షల ఎకరాలు సాగయిందన్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ లో ఇప్పటివరకు దాదాపు కోటీ 40 లక్షల ఎకరాలలో రైతులు పంటలు సాగు చేశారని గుర్తుచేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పంటలు సాగుచేశారన్నారు. గత వానాకాలానికి, ఈ ఏడాది వానాకాలానికి పెరిగిన సాగును కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని, తెలంగాణకు కేటాయించిన మేరకు మొత్తం యూరియా కోతలు లేకుండా కేంద్రం సరఫరా చేయాలని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
నెల‌ల వారీగా కేంద్రం కేటాయింపులు

  • ఏప్రిల్ నెలలో తెలంగాణకు రావాల్సింది 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసింది 0.69 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.37 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది.
  • మే నెల కేటాయింపు 1.63 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.09 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.54 లక్షల మెట్రిక్ టన్నులు.
  • జూన్ కు సంబంధించి కేంద్రం కేటాయించిన యూరియా 1.38 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.29 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.09 లక్షల మెట్రిక్ టన్నులు అలాగే ఉంది.
  • జులై నెలకు సంబంధించి తెలంగాణకు కేటాయించిన యూరియా 2.06 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.27 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.79 లక్షల మెట్రిక్ టన్నులు
  • ఆగస్టు నెలకు కేటాయించింది 2.56 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.81 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.75 లక్షల మెట్రిక్ టన్నులు
  • మొత్తం ఆగస్టు వరకు 8.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉండగా 6.15 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సరఫరా చేసింది. 2.54 లక్షల మెట్రిక్ టన్నుల బకాయి రావాల్సి ఉంది
RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img