మరికల్, నారాయణపేటలలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ హరిచందనలు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేసిఆర్ నియంత్రిత సాగు విధానం దేశానికి దిక్సూచీ వంటిది అన్నారు. మంత్రి ప్రసంగంలోని పలు అంశాలు…
- తెలంగాణలో ఆరేళ్ల పాలనతో వ్యవసాయం లాభసాటి చేశాం
- కరోనా కష్టకాలంలో ఈ దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయరంగమే
- తెలంగాణలో వ్యవసాయ అనుకూల విధానాలతో సాగుకు రైతుల మొగ్గు
- ఈ రోజు వరకు రాష్ట్రంలో 1 కోటి 35 లక్షల ఎకరాలలో అన్ని పంటలు సాగుచేశారు .. మరో నాలుగు లక్షల ఎకరాలలో సాగయ్యే అవకాశం ఉంది
- 47 లక్షల ఎకరాలలో వరి సాగుచేశారు, దాదాపు 11 లక్షల ఎకరాలలో కంది సాగుచేశారు
- మొక్కజొన్న సాగుచేయొద్దన్న కేసీఆర్ విజ్ఞప్తిని తెలంగాణ రైతాంగం స్వాగతించింది
- తెలంగాణలో వ్యవసాయరంగంలో కేసీఆర్ గారి నిర్ణయాలను నాబార్డు స్వాగతించింది .. దేశంలో ఈ విధానాలు అమలైతే రైతాంగానికి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు
- ఇన్ని ఎకరాలు సాగైనా ఎక్కడా ఎరువుల కొరత రాకుండా వ్యవసాయ శాఖ నుండి పకడ్భంధీగా ప్రణాళిక చేశాం
- తెలంగాణలో సాగునీటి రాకతో పెరిగిన సాగు విస్తీర్ణం కేంద్రానికి నివేదించి 22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించేలా చేశాం
- ఇందులో 10.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించడం జరిగింది
- రాష్ట్రంలో యూరియా కొరత లేదు .. రైతులు అనవసరంగా ఆందోళన చెందవద్దు
- ఈ నెలకు సంబంధించి కేంద్రం నుండి లక్ష 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది .. అయినా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
- వ్యవసాయం లాభసాటి అయితేనే అన్ని వర్గాలకు ఉపాధి దొరుకుతుంది
- రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల కరంటు, సాగునీటితో వ్యవసాయం దశతిరిగింది
- వర్షాలతో చెరువులన్నీ నిండిపోయాయి
- కోయిల్ సాగర్ అలుగుపారింది
- సగటు వర్షపాతానికి మించి ఉమ్మడిజిల్లాలో వర్షాలు కురిసాయి
- రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో అత్యధిక వర్షపాతం
- 36 గంటల్లో 57 లక్షల రైతుల ఖాతాలలో రూ.7300 కోట్లు రైతుబంధు నిధులు జమ చేశాం
- తెలంగాణ ప్రజల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుంది.