Homeతెలంగాణమునగ, కరివేపాకు సాగుకు ప్రోత్సాహం

మునగ, కరివేపాకు సాగుకు ప్రోత్సాహం

పండ్లు, కూరగాయలతో వీటిని సాగుచేయాలి
విదేశీ ఎగుమతులకు విస్తృత అవకాశాలు
మునగ, కరివేపాకు ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రోత్సాహం

రంగారెడ్డిజిల్లాః మున‌గ‌, క‌రివేపాకు సాగుకు ప్రోత్సాహం అందిస్తామ‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రగతి రిసార్ట్స్ లో మునగ, కరివేపాకు, ఔషద తోటలను సందర్శించి అరుదైన కల్పవృక్షం మొక్కను ఆయ‌న నాటారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతులు అద‌న‌పు ఆదాయం పొందేందుకు పండ్లు, కూరగాయలతో వీటిని సాగుచేయాలని మంత్రి రైతుల‌కు సూచించారు. విదేశీ ఎగుమతులకు విస్తృత అవకాశాలు ఉన్నాయ‌ని, మునగ, కరివేపాకు ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రోత్సాహిత్సామ‌ని, వ్యవసాయంలో రాణిస్తున్న యువత వీటి సాగుపై దృష్టి సారించాలని మంత్రి చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితోపాటు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు, ప్రగతి రిసార్ట్స్ అధినేత జీబీకే రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img