Homeఎడిటోరియల్​#Vastu shastra #Home #Sink : వాస్తు ప్రకారం ఈ దిక్కున సింక్ ఉండొద్దా..

#Vastu shastra #Home #Sink : వాస్తు ప్రకారం ఈ దిక్కున సింక్ ఉండొద్దా..

వాస్తుని మనం అనుసరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

అందుకే మనం వాస్తు ఎక్స్‌పర్ట్స్ చెప్పిన ఈ విషయాలను పాటించడం మంచిది.

అయితే ఈ రోజు వాస్తు నిపుణులు ఇంట్లో ఫర్నిచర్‌ని ఎలా పెట్టాలి. ఏ దిక్కులో ఏం ఉంచాలి వంటి ముఖ్యమైన విషయాలను చెప్పారు.

మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.

అయితే వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని ఉంచడం వల్ల కేవలం పాజిటివిటీ మాత్రమే కాదు.

ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ధన నష్టం, ఇంట్లో గొడవలు వంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఇది కాపాడుతుంది.

లైటింగ్, పెయింటింగ్, రంగులు, డిజైన్లు మొదలైనవన్నీ కూడా దీనిలో చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుని సర్దుకోవడం మంచిది. అయితే ఈ రోజు ఫర్నిచర్‌ని ఏ దిక్కులో ఉంచితే మంచిది.

ఎటువంటి సమస్యలు రాకుండా మనం చూసుకోవచ్చు.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వాస్తు నిపుణులు చెప్పారు.

మరి వాటి కోసం ఒక లుక్ వేసేయండి. వీటిని పాటించడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు వుండవు. అదే విధంగా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.

ఎంట్రన్స్ మరియు లివింగ్ రూమ్:

ముందుగా మనం ఎంట్రన్స్ మరియు లివింగ్ రూమ్‌లో ఫర్నిచర్‌ని ఎలా ఉంచుకోవాలి అనేది చూద్దాం..! ప్రతి ఎనర్జీ కూడా లివింగ్ రూమ్ నుండి వెళ్తుంది.

నిజంగా లివింగ్ రూమ్ చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి మరియు పాజిటివ్ వైబ్రేషన్స్‌ని ఇచ్చేటట్టు ఉంచాలి. సోఫాలు మరియు టేబుల్స్ పడమర, దక్షిణం వైపు ఉంటే మంచిది.

ఇది పాజిటివిటీని ఆకర్షిస్తుంది. ఫర్నిచర్‌ని కొనుగోలు చేసేటప్పుడు గుండ్రంగా ఉండే వాటిని ఎంచుకోవద్దు.

టీవీని ఎప్పుడూ కూడా దక్షిణం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉంచితే మంచిది.

ఇష్టం వచ్చినట్లు సామాన్లని పెట్టొద్దు. ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత అందంగా ఇల్లు ఉంటుంది.

అలానే ఎప్పుడూ కూడా లివింగ్ రూమ్‌ని శుభ్రంగా ఉంచుకోండి. దీనితో మీ లివింగ్ రూమ్‌లో మరియు ఎంట్రెన్స్‌లో పాజిటివిటీ ఉంటుంది.

డైనింగ్ ఏరియా :

ఇక డైనింగ్ ప్రదేశంలో ఎలాంటి పద్ధతులని ఫాలో అవ్వాలి అనేది చూస్తే.. మీ ఇంట్లో కనుక వేరేగా డైనింగ్ రూమ్ ఉంటే డైనింగ్ టేబుల్ ని వాయవ్యం వైపు ఉంచుకోవడం మంచిది.

దీని వల్ల తినే ఆహారం జీర్ణం అవ్వడానికి ఇది బాగా సహాయం చేస్తుంది.

ఎప్పుడూ కూడా డైనింగ్ టేబుల్ కొనుగోలు చేసేటప్పుడు చెక్క టేబుల్ ని కొనుగోలు చేయండి.

దాని మీద అద్దం ఉంటే కూడా మంచిదే. డైనింగ్ చేసే ప్రదేశంలో ఎప్పుడూ కూడా లైట్ కలర్‌ని వాడండి.

ముదురు రంగులు వాడటం వల్ల ఇబ్బందులకు గురిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు డైనింగ్ ఏరియాలో ఈ తప్పులు చేయకుండా ఉండటం మంచిది.

వంట గది:

ఇక వంట గది విషయంలోకి వస్తే .. ఇంట్లో ఉండే వైబ్రేషన్స్ అన్నీ కూడా వంట గది మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే వంట గదిలో అగ్ని, గాలి, నీరు అన్నీ ఉంటాయి.

ఎప్పుడూ కూడా వీటన్నిటినీ బ్యాలెన్స్‌గా ఉంచుకోవడం మంచిది. మీ సింక్ పక్కన స్టవ్ ఉండకుండా చూసుకోండి. ఇది నెగిటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తుంది.

కనుక అలా సింక్ పక్కన స్టవ్ పెట్టకండి. అదే విధంగా ఎప్పుడూ చీకటిలో కూరగాయల్ని ఉంచొద్దు.

వంట గది మూలల్లో కూడా కూరగాయలు పెట్టొద్దు. ఇలా మీ వంట గదిలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

పూజ గది:

పూజ గదిలో కూడా వాస్తు చిట్కాలని పాటిస్తే మంచిది. పూజ గదిలో ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోండి.

అదే విధంగా పగిలిపోయిన దేవుడి విగ్రహాలు కానీ విరిగి పోయిన దేవుడి విగ్రహాలు కానీ పెట్టొద్దు ఇలా పెట్టడం వల్ల నెగిటివిటీ వస్తుంది.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం మంచి విగ్రహాలను మాత్రమే పెట్టడం లాంటివి చేయండి.

దీనితో మీ ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది కనుక ఈ తప్పులు కూడా చేయకుండా చూసుకోండి.

బెడ్ రూమ్:

ఇక బెడ్ రూమ్‌లో ఎటువంటి వాస్తు చిట్కాలు పాటించాలి అనే విషయానికి వస్తే.. బెడ్ రూమ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ విధంగా మీ బెడ్ రూమ్ ని సర్దుకుంటూ ఉండండి.

మంచాన్ని ఎప్పుడూ కూడా నైరుతి దిశలో ఉంచండి. ఇలా ఉంచడం వల్ల శాంతంగా ఉంటుంది.

ఇది ఇలా ఉంటే గోడలకి, కిటికీలకు, తలుపులకు దూరంగా మంచాన్ని ఉంచుకోండి.

అలానే మీ మంచానికి ఎదురుగా టీవీ కానీ అద్దాన్ని కానీ ఉంచొద్దు.

ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి ఈ తప్పులు కూడా చేయకుండా ఉండటం మంచిది.

బాత్ రూమ్:

బాత్ రూమ్ కూడా నెగటివ్ ఎనర్జీని తీసుకు వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి బాత్రూంలో కూడా వాస్తుని అనుసరించడం మంచిది. ముఖ్యంగా ఎనర్జీని రెగ్యులేట్ చేయడంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

కాబట్టి బాత్రూంలో ఉండే ఫ్లోర్ ఎప్పుడూ కూడా చెక్కతో కానీ లేదంటే రాయితో కానీ ఉండేటట్లు చూసుకోండి. అదే విధంగా బాత్రూంలో వెంటిలేషన్ సరిగ్గా ఉండాలి.

దక్షిణ వైపు బాత్రూం షెల్ఫ్ మరియు అద్దం ఉండకుండా చూసుకోండి. ఇలా ఇంట్లో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా మీయొక్క సామాన్లని అమర్చుకోండి.

చూశారు కదా వాస్తు ఎక్స్పర్ట్స్ చెప్పిన అద్భుతమైన చిట్కాలు. మరి ఈ చిట్కాలను మీరు రెగ్యులర్‌గా మీ ఇంట్లో పాటించి సమస్యల బారి నుంచి బయటపడండి.

ధననష్టం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, ప్రశాంతత లేక పోవడం వంటి సమస్యల నుండి బయట పడడానికి ఈ వాస్తు చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి.

కాబట్టి ఈ చిట్కాలను అనుసరించి సమస్యల నుండి బయట పడండి.

దీంతో ఎంతటి సమస్య అయినా మాయమైపోతుంది. తద్వారా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img