Homeజిల్లా వార్తలుసారూ.. రోగాలు పెరుగుతున్నాయి.. చర్యలు తీసుకోండి.. మున్సిపల్ కమిషనర్ కు వినతి

సారూ.. రోగాలు పెరుగుతున్నాయి.. చర్యలు తీసుకోండి.. మున్సిపల్ కమిషనర్ కు వినతి

ఇదేనిజం, లక్షెట్టిపేట: పట్టణంలో రోగాలు పెరుగుతున్నాయి చర్యలు చేపట్టమంటూ స్థానిక యువకులు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలో విష జ్వరాల భారీగా పెరిగి పోయాయాని, అందువల్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మురుగు నీరు, వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమల పెరుగుదలకు కారణమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకుడు దర్శనాల నవీన్ కుమార్ మాట్లాడుతు.. లక్సట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటికోకరు విష జ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని, దోమల మందు కొట్టడం, బ్లీచింగ్ చేయడం, రోడ్ల పైన వ్యర్థాలు, వాటి నిల్వలను తొలగించాలని కోరారు. 9వ వార్డ్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన విద్యార్థి నాయకుడు ఇందల్ రాథోడ్, స్థానిక యువకులు చిప్పకుర్తి నాగరాజు, కండ్ల ప్రదీప్, శనిగరపు ప్రవీణ్, జూల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img