Homeజిల్లా వార్తలుసారూ..తుర్కపల్లి మానేరు వాగు నుండి ఇసుక రిచ్ అనుమతులు ఇవ్వకండి : గ్రామస్తులు

సారూ..తుర్కపల్లి మానేరు వాగు నుండి ఇసుక రిచ్ అనుమతులు ఇవ్వకండి : గ్రామస్తులు

ఇదే నిజం ముస్తాబాద్ మండలం : మానేర్ వాగు అవునూర్ తుర్కపల్లి ప్రభుత్వ అనుమతులతో ఇసుక రిచ్ ల నుండి ప్రభుత్వ అనుమతులతో పర్మిషన్ ఇవ్వగా తుర్కపల్లి గ్రామ రైతుల వాగు పక్కన పొలాల వద్ద నుండి ఇసుక తీయడంతో ఆ ప్రాంత రైతుల పంట పొలాలకు వేసుకున్న బోర్లు పైపులు వందల ట్రాక్టర్ల రవాణా వల్ల పగిలిపోయి. ఆ ప్రాంతంలో ఇసుక లేకున్నా ఇసుక తీయడంతో పంట పొలాల రైతులు నష్టపోతున్నామని తుర్కపల్లి రైతులు ఇసుక రిచ్ కు తాళం వేసి ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. వందల ట్రాక్టర్లను నిలిపివేశారు స్థానిక తహసిల్దార్ కు ఫోన్ చేసి ఇసుక రిచ్ కు వద్దకు వెంటనే తాసిల్దార్ చేరుకొని ప్రాంత రైతులు పంట పొలాల వద్ద ఇసుక లేదు ఇక్కడ మా పొలాల భూములను ధ్వంసం చేస్తున్నారని వేరే ప్రాంతం నుండి పర్మిషన్ ఇవ్వండి సార్ అని తాసిల్దార్ విన్నవించుకున్నారు. అలాగే ఇసుక ట్రాక్టర్ యజమానులు ఏడు గంటలకే వాగులోకి దిగి ట్రాక్టర్లు లోడ్ చేసి ఉండడంతో సమయం కాకముందుకు సిబ్బంది లేకుండానే టోకెన్లు ఇవ్వకముందుకే ఇసుక ను ఎలా తరలిస్తారని టాక్టర్ల యజమానులపై తాసిల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడ్ చేసిన ఇసుక ట్రాక్టర్లను అన్లోడ్ చేయాలని టాక్టర్ల డ్రైవర్లకు యజమానులకు హెచ్చరించారు. తుర్కపల్లి వాగు పరివాహక ప్రాంత మా ప్రాంతం నుండి ఇసుక ఇవ్వవద్దని తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తుర్కపల్లి వాగు నుండి ఇసుక రిచ్ పర్మిషన్ లేకున్నా పంట పొలాల వద్ద నుండి ఇసుక తీయడంతో నష్టపోతున్నామని చెక్ డాం పక్కనుండి బ్రిడ్జి వద్దనుండి ఇసుక తీయడంతో ఎప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది తెలియని పరిస్థితి ఇక్కడి నుండి ఇసుక రిచ్ ఇవ్వద్దని జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ కి తాసిల్దార్ కి విన్నవించుకుంటున్నామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img