Homeహైదరాబాద్latest Newsసార్.. నా లవ్ మీ చేతిలో.. నన్ను పాస్ చేయండి.. పదో తరగతి విద్యార్థి సాహసం...

సార్.. నా లవ్ మీ చేతిలో.. నన్ను పాస్ చేయండి.. పదో తరగతి విద్యార్థి సాహసం నెట్టింట హల్‌చల్..!

కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడిలో ఓ పదో తరగతి విద్యార్థి పరీక్షలో చేసిన సాహసం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పరీక్ష పత్రంలో రూ.500 నోటు పెట్టి, “సార్, నన్ను పాస్ చేయండి.. ప్రేమలో గెలవాలంటే మీ దయే ఆధారం” అని హృదయపూర్వక విజ్ఞప్తి చేశాడు. ఈ ఆన్సర్ షీట్‌ను చూసిన ఉపాధ్యాయుడు దాని ఫోటో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో, అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ విద్యార్థి సృజనాత్మకతను మెచ్చుకుంటూ, “సార్, పాస్ చేసేయండి!” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

అలాగే, కొంతమంది జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు రూ.500 నోట్లు పెట్టారు. పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు. మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు.

Recent

- Advertisment -spot_img