ఇదే నిజం, గొల్లపల్లి: ప్రజా పాలనలోని పాత దరఖాస్తుల సమస్యలు పరిష్కరిస్తూ కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించాలని గోవిందుల లావణ్య-జలపతి (MPTC) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమములో వివిధ పతకాలకు గాను వివిధ గ్రామాలలో నిరుపేదలు దరఖాస్తూ చేసుకోవడం జరిగినది, కాని అందులో గృహజ్యోతి, గృహలక్ష్మి పతకాలను ప్రభుత్వం అమలు చేసినప్పటికి, కొందరికి గృహజ్యోతి దరఖాస్తూ చేసుకునప్పటికి ఆన్ లైన్లో చూపడం లేదు, గృహలక్ష్మి కి గ్యాస్ కనెక్షన్ కి ఆధార్ కు మ్యాచ్ కాకపోవడం వలన ఏజెన్సీ వారు మావద్ద అన్ని సక్రమంగానే ఉన్నాయని తెలిపినారు. కాని ఆన్ లైన్ మాత్రం కనెక్షన్ కు, ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోవడం లేదు. ఇప్పటి మండలంలోని గ్రామాల ప్రజలు గ్యాస్ సబ్సిడీ కాని, ఉచిత కరెంటు పొందలేక పోతున్నారు. ప్రభుత్వం గతంలో ప్రజా పాలన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పినప్పటికీ మొదటి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించి 6 నెలలు గడిచినప్పటికీ గత దరఖాస్తుల సమస్యల పరిష్కారం లభించలేదు మరియు కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదు. కావున పాత దరఖాస్తుల పరిష్కారం చూపుతూ, కొత్త దరఖాస్తులు తీసుకోగలరని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాంరెడ్డి (గొల్లపల్లి)కి గోవిందుల లావణ్య-జలపతి (MPTC) వినతి పత్రం అందచేయడం జరిగినది.