ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం లోని ప్రియాంక గాంధీ మహిళ సంక్షమ సంఘం (మాదిగ)సభ్యులకు చెందిన 0.04 గుంటల భూమి ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఖాబ్జా చేశారాని ఆరోపిస్తూ, ముస్తాబాద్ తాసిల్దార్ సురేష్ కు వినతిపత్రం అందజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పోతుగల్ గ్రామం లోని సర్వే నెంబర్ 113/3 లో 1-03 గుంటల భూమి ఉండేది అని, దానిలో నుండే 0-12 గుంటల భూమి అప్పటి సర్పంచ్ వెన్నమనేని నారాయణ రావు బడికి మహిళ భవనం కు కేటాయించారు. అని అట్టి స్థలం లో బడి మహిళ భవనాలు 30 సంవత్సరాల క్రితమే నిర్మాణం జరగాయని, ఇప్పుడు మహిళ భవనం కు చుట్టు కాంపాండ్ గోడ కు ఎంపీ నిధుల నుండి మూడు లక్షలు మంజూరు కాగా ఈ మధ్యకాలం లో కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ వచ్చి భూమి పూజ చేశారని, కాని ఇప్పుడు అట్టి కాంపౌండ్ గోడ పనిని ప్రారంభిస్తే, ఈ ఖాబ్జా చేసిన వ్యక్తులు అడ్డు కుంటున్నారని వాపోయారు. ఇట్టి విషయం పై మండల తాశిల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ మహిళ సంక్షేమ సంఘం (మాదిగ)సభ్యులు మినుప భారతవ్వ, కేసుగాని పోషవ్వ, పేరుమని లీలావ్వ, కొండని ఎల్లవ్వ,లక్ష్మి,సర్వని లక్ష్మి,కేసుగాని లస్మవ్వ, లక్ష్మి, ఎల్లవ్వ,మినుప బాబాయి, బాలక్ష్మి, శోభ, లక్ష్మి, లచ్చిగారి బాలక్ష్మి, గోడిసేల బుధవ్వ, లక్ష్మి, బొల్లె యాదమ్మ, ముత్తవ్వ, లక్ష్మి, బాలక్ష్మి. బిజెపి పోతుగల్ గ్రామ శక్తి ఇంచార్జ్ చీకోటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.