రాష్ట్రంలోని రైతులు రైతు బంధు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నిత్యం తమ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటున్నారు. రైతు బంధు పడిందా లేదా అని చర్చించుకుంటున్నారు. ఓ ఊర్లో చూసినా ఇదే చర్చ. అయితే ఇప్పటివరకు మూడెకరాల లోపు రైతులందికీ అకౌంట్లో సొమ్ము జమ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా? అన్నది డౌడే. చాలా మంది మూడెకరాల లోపు భూమి ఉన్న సైతం తమకు రైతు బంధు పడలేదని చెబుతున్నారు. దీంతో ఈ పథకం మీద నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి ఈస్కీమ్ కేసీఆర్ మానస పుత్రిక. పెట్టుబడి పెట్టే సాయంలో రైతుల దగ్గర డబ్బు ఉంటే.. వాళ్లు అప్పు చేయాల్సిన అవసరం ఉండదన్న గొప్ప లక్ష్యంతో గత ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాము పవర్ లోకి ఎకరానికి రూ. 15,000 ఇస్తామన్నారు. దీంతో రైతులు నమ్మి ఆ పార్టీకి ఓటేశారు. నిజానికి కాంగ్రెస్ హామీ ప్రకారం.. రైతులకు ఎక్కువ సొమ్ము రావాలి. వారితోపాటూ రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా పరిహారం అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రైతు బంధు పథకమే అమలు కావడం లేదు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే కుట్ర జరుగుతుందా?
ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ అన్న పథకాల పేరు చెప్పగానే అందరికీ టక్కున వైఎస్సార్ గుర్తొస్తారు. అలాగే రైతు బంధు, రైతు బీమా వంటి స్కీములు పేరు చెబితే కేసీఆర్ గుర్తొస్తారు. ఇక ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సవాల్ విసిరారు. ఇక అందులో భాగంగానే.. రైతు బంధు పథకం కొనసాగిస్తే కేసీఆర్ కు పేరొస్తుందని కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నారేమో తెలియదు.. కానీ మొత్తంగా ఈ స్కీమ్ అమలు కాకపోవడంతో ఎంతో మంది రైతులు కండ్లు నీళ్లు నింపుకుంటున్నారు. కొంతమంది ఎక్కువ వడ్డీగా ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం విషయంలో పునరాలోచిస్తుందేమో వేచి చూడాలి. ఇక ఇటీవల బడ్జెట్ సందర్భంగా నిర్వహించిన చర్చలో రాష్ట్రంలో యాసంగి పంటలు పూర్తి కావొస్తున్న సందర్భంగా రైతు బంధు నిధులు విడుదల చేయాలంటూ కడియం శ్రీహరి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వాయిదా తీర్మానం అందజేశారు. ఆయన దీన్ని తిరస్కరించారు. దీంతో రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక రైతు బంధు గురించి ఎవరైనా గట్టిగా అడిగితే మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరి సర్కారు రైతు బంధు వేస్తుందా? పథకాన్ని నీరు గారుస్తుందా? అన్నది వేచి చూడాలి.