Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార చిన్న వయసులోనే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సితార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేది. సితార చిన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి చాలా వీడియోలు చేసి బాగా ఫేమస్ అయింది. ఏకంగా మహేష్ తోనే ఇంటర్వ్యూ చేసి అందిరిని ఆశ్చర్యపరిచింది. సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజీ ఫోటోలు, కుటుంబ ఫోటోలను అప్లోడ్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. కేవలం 14 ఏళ్లకే సితారప్రముఖ నగల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. అయితే సితార గతంలో మహేష్ బాబు ”సర్కార్ వారి పాట” సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్‌లో నటించింది. ఇదిలా ఉండగా, సితార త్వరలో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుందని వార్తలు వస్తున్నాయి. నటనపై ఆసక్తి ఉన్నందున సితార ఇప్పటికే ఒక యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ఒక పెద్ద డైరెక్టర్ సినిమాలో సితార యువరాణి స్టోరీతో సినిమా చేయబోతుంది అని సమాచారం. దీనికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.