Homeహైదరాబాద్latest NewsBJPలోకి సీతారాం నాయక్!

BJPలోకి సీతారాం నాయక్!

ఇదే నిజం, వరంగల్ ప్రధాన ప్రతినిధి : బీఆర్ఎస్ నుంచి వలసల పరంపర కొనసాగుతోంది. నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. మహబూబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. కారు దిగి కమలంతో జతకట్టేందుకు రెడీ గా ఉన్నారు.

సీతారాం నాయక్ ఇంటికి కిషన్ రెడ్డి…
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తన వరంగల్ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం హనుమకొండలోని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి వెళ్లారు. ఆయన సీతారాం నాయక్ ఇంట్లో భేటీ అయ్యారు. అనంతరం కిషన్ రెడ్డి, సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ములుగు మండలం జాకారం వద్ద ట్రైబల్ యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని, అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ లో ఉంటూ కూడా గిరిజన రిజర్వేషన్ల కోసం సీతారాంనాయక్ పోరాటం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీతారాంనాయక్ ను అభినందించడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. సీతారాంనాయక్ వస్తే బీజేపీలోకి చేర్చుకుంటామని కిషన్ రెడ్డి ప్రకటించారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ కిషన్ రెడ్డి తనను బీజేపీలోకి ఆహ్వానించారు. త్వరలో కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మా ఇంటికి రావడం సంతోషంగా ఉందని, నా కృషిని గుర్తించిన కిషన్ రెడ్డికి ధన్యవాదాలు అన్నారు. జాకారంలో జరిగిన ట్రైబల్ యూనివర్సిటీ భవనం ప్రారంభోత్సవానికి వెళ్లినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు గుర్తింపు లేదని, కానీ కిషన్ రెడ్డి గుర్తించారని అన్నారు. గత కొన్నేళ్లుగా చాలా కలత చెందానని, గౌరవం ఉన్నచోటికి వెళ్తానని సీతారాం నాయక్ ప్రకటించారు. సీతారాం నాయక్ గతంలో ఒకసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు.

Recent

- Advertisment -spot_img