Six bills accepted Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయినపట్పి నుంచి..
చాలా రవవత్తరంగా సాగుతున్నాయి. అయితే… ఇవాళ్టి రోజున తెలంగాణ అసెంబ్లీ ఏకంగా అరు బిల్లులకు ఆమోద ముద్ర వేయనుంది.
తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021 ను..తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనుండగా…
ది తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ టౌటింగ్ అండ్ మాల్ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెడతారు.
ఇక మూడో బిల్లు అయిన తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021 ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లును నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.
ది నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సవరణ బిల్లు ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.
తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టనున్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంఖ్య ఎక్కుగా ఉండటంతో ఈ బిల్లులు సులభంగానే ఆమోదం కానున్నాయి.