Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన పూల ధరలు..!

తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన పూల ధరలు..!

పూల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రేపు సద్దుల బతుకమ్మతో పాటు నవరాత్రుల సందర్భంగా పూలను కొనుగోలు చేసేందుకు తెల్లవారు జాము నుంచే పెద్దఎత్తున జనాలు మార్కెట్లకు తరలివెళ్లి పూలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా పూలకు డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల కిందట గరిష్ఠంగా రూ.30 పలికిన పూల ధరలు అమాంతం రూ. 100 నుంచి రూ.200లకు పెరగడంతో కొనుగోలుదారులు నిర్ఘాంతపోతున్నారు.

Recent

- Advertisment -spot_img