స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. హాండ్లోవాలో కేబినెట్ మీటింగ్‌లో పాల్గొని తిరిగివస్తుండగా ఓ దుండగుడు అయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ఆ దేశ అధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు.