– మూడువేల మందితో మాట్లాడి ఆకలి సూచీ లెక్కిస్తారంటూ కామెంట్
– కేంద్రమంత్రి కామెంట్లపై కాంగ్రెస్ ఫైర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: హంగర్ ఇండెక్స్ నివేదికపై స్మృతీ ఇరానీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. దేశ ప్రజల్లో 3000 మందిని పిలిచి, ఆకలేస్తుందా అని వారిని పశ్నించి ఆకలి సూచీని లెక్కిస్తారంటూ ఆమె కామెంట్ చేశారు. 140 కోట్లమంది దేశ ప్రజల్లో కేవలం 3000 మందిని పిలుస్తారని ఆమె పేర్కన్నారు. కాగా ఆమె మాటల్లో దయలేదని ఆమె మాటల్లో దయ లేదని, అజ్ఞానం కనిపిస్తోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఈ ఏడాది విడుదలైన హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్ 111వ స్థానంలో ఉంది. ఆకలి సూచీలో పాకిస్థాన్(102) కంటే వెనకబడి ఉండటాన్ని ప్రశ్నిస్తూ.. స్మృతి స్పందించారు. ‘భారతదేశ స్టోరీని ఇలాంటి సూచికలు అంచనావేయవు. ఉద్దేశపూర్వకంగా అలా జరగొచ్చు.’ అంటూ స్మృతీ ఇరాని పేర్కొన్నారు.