Homeహైదరాబాద్latest NewsSnakes : పాములు నిజంగా పగబడతాయా..? అసలు వాస్తవాలు ఏంటి..?

Snakes : పాములు నిజంగా పగబడతాయా..? అసలు వాస్తవాలు ఏంటి..?

Snakes : పాములు మీద మనకి చాలా అపోహలు ఉన్నాయి.. పాములు పగబడతాయనే నమ్మకం చాలా ప్రాంతాల్లో ఉంది, కానీ అవ్వని పూర్తిగా అపోహేలు మాత్రమే..శాస్త్రీయంగా చూస్తే, పాములకు పగ తీర్చుకునే సామర్థ్యం లేదు. పాము కాటు వేయడం అనేది స్వీయ రక్షణ లేదా ఆహారం కోసం మాత్రమే, పగ తీర్చుకోవడానికి కాదు. కొన్ని కథలు, సినిమాలలో పాములు పగబడతాయని చెబుతాయి, కానీ అవ్వని నిజం కాదు. పాముకు మనిషికి గాని పశువును గని గుర్తుపటే శక్తీ ఉండదు. అవి తొందరగా మర్చిపోతాయి.

పాములు 20 నుండి 26 ఏళ్ళు బ్రతుకుతాయి. అయితే ప్రపంచంలో 3,789 జాతుల పాములున్నాయని అంచనా. ఒక్క తెలంగాణలోనే 16 నుండి 18 రకాలు పాములు ఉన్నాయి. అయితే ఈ 18 రకాల పాముల్లో కేవలం 3 పాములకే విషం ఉంటుంది.

కోబ్రా : వాటిలో మొదటిది కోబ్రా.. దీన్ని నాగుల పాము అని కూడా అంటారు. ఈ పాము ఎక్కువగా మన ఇంటి చుటూ పక్క పరిసరాల్లో ఉంటుంది. ఈ పాము విషాన్ని న్యూరో టాక్సిస్ అని అంటున్నారు. ఈ పాము ఒకే కాటులో 200-500 మి.గ్రా విషాన్ని ఇంజెక్ట్ చేయగలదు. దీని విష ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఒక మనిషిని కాటు వేసిన తరువాత మనిషి రక్తాన్ని గడ్డ గట్టిస్తుంది. శరీరంలోని నాడీ కండరాల ప్రసారాన్ని నిరోధిస్తాయి. దీని వల్ల శ్వాసకోశ అరెస్ట్, గుండె వైఫల్యం వంటి సమస్యలు ఏర్పడతాయి.

చెడుగు పాము : చెడుగు పాములో కొన్ని రకాల పాములు ఉంటాయి. వీటిలో కేవలం ఒక పాముకి మాత్రమే విషం ఉంటుంది.పాము వెనకాల నాలుగు రంగులో ఉండి తెల గీతాలు ఉంటె ఆ పాముకు విషం ఉంటుంది. ఇది భారతదేశంలో అత్యంత విషపూరితమైన చెడుగు పాము. ఈ పాము కాటు వేస్తే వెంటనే ఆ మనిషికి వైద్య చికిత్స చేయకపోతే ప్రాణాంతకం. అయితే గోధమ రంగులో ఉండి నల్ల గీతాలు ఉంటే దానికి విషం ఉండదు. గోధమ రంగులో ఉండి తెల గీతాలుతో తలపై v షేప్ తో ఉంటే ఆ పాముకు విషం ఉండదు.

పింజర పాము : రక్త పింజరి పాము ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దాని శరీరంపై మచ్చలు ఉంటాయి. ఇవి గడ్డి వాములు, ముళ్ళ పొదలలో ఇవి పొంచి ఉంటయి. ఈ పాము ఒక్క కాటులో ఇది పంపే విషం 16 మందిని చంపగలదు.

కొండా చిలువ : కొండా చిలువలు అడవులు, పొదలు మరియు రాళ్ల ప్రాంతాలలో నివసిస్తాయి. సాధారణంగా కొండ చిలువలు, పాముల కన్న అత్యంత బలంగా ఉంటాయి. పాములు కాటు వేయడం ద్వారా చంపేస్తే.. ఇవి తమ వేటను చుట్టుకొని ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత అమాంతం మింగేస్తాయి. రెటిక్యులేటెడ్ జాతీకి చెందిన కొండ చిలువలను ప్రపంచంలోనే అతి పొడవైనవి గా చెప్తుంటారు. ఈ పాములు 20 నుంచి 25 అడుగుల పొడవు ఉంటాయి.

అయితే పాములు కాటువేస్తే ఊరులో మంతరాలు, చెట్ల మందులు వేస్తారు. కానీ ఈ మూడు పాములు కాటువేస్తే మాత్రం ఆ మందులు పని చేయవు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఇంజక్షన్ చేయించుకోవాలి. పాములు విషం నుండి మెడిసిన్ తయారీ చేసారు. పాముల విషంలో ప్రోటీన్లు, పెప్టైడ్స్, మరియు ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి ఔషధ పరిశోధనలో ఉపయోగపడతాయి. పాముల విషం ఔషధాల తయారీలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన సామర్థ్యాన్ని చూపిస్తోంది,

Recent

- Advertisment -spot_img