తెలుగు తెరపై జూనియర్ ఐష్‌గా మంచి క్రేజ్ కొట్టేసిన స్నేహా ఉల్లాల్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది.
స్నేహా ఉల్లాల్ అనగానే ప్రతి ఒక్కరి మదిలో ఓ రూపం అలా ప్రత్యక్షమైపోతుంది.
అచ్చం ఐశ్వర్య రాయ్ రూపంతో ప్రేక్షకుల మదిలో అలా స్థిరపడిపోయింది ఈ ముద్దుగుమ్మ.
సినిమా అవకాశాల సంగతి పక్కన బెడితే తనదైన లుక్స్‌తో ఫాలోయింగ్ మాత్రం బాగానే పెంచుకుంది స్నేహా ఉల్లాల్.
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్‌లు అందుకోకపోయినా జూనియర్ ఐష్‌గా పాపులర్ అయింది.
సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది.
ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట రచ్చ చేస్తోంది.
ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ వేదికలపై స్పీడు మరింత పెంచేసింది యంగ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్.
తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ ట్రీట్స్ ఇస్తూ కుర్రకారు చూపు తిప్పనీయడం లేదు.
ఈ క్రమంలోనే రీసెంట్‌గా బ్యాక్ లెస్ పోజుతో ఓ వ్యక్తి కౌగిలిలో బెడ్‌పై ఉన్న ఓ అమ్మాయి పిక్ షేర్ చేసి షాకిచ్చింది స్నేహా.
ఇందులో ఇద్దరూ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తుండటం.. పైగా ‘నేను కాదు.. కానీ నేనే కావచ్చు’ అంటూ దీనిపై ఆమె పెట్టిన క్యాప్షన్ పెద్ద చర్చకే దారితీసింది.
ఇదిలా ఉండగానే మరో సెన్సేషనల్ పిక్ పోస్ట్ చేసి ఆన్ లైన్ రచ్చకు తెరలేపింది స్నేహా.
ఓ అమ్మాయి అర్థనగ్నంగా ఉండి మొక్కలకు నీళ్లు పోస్తున్న కార్టూన్ పిక్ షేర్ చేసిన స్నేహా ఉల్లాల్.. ”పచ్చగా ఉండేలా నా సొంత గడ్డికి నేను నీళ్లు పోసుకుంటున్నా” అని ట్యాగ్ చేస్తూ ‘కీప్ ఇట్ రియల్’ అనే హ్యాష్ టాగ్ జత చేసింది.
దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి షాకైన నెటిజన్స్ స్నేహా ఎందుకిలాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇంకొందరైతే ఏకంగా మాటల్లో చెప్పలేని పదాలతో రచ్చ రచ్చ చేస్తున్నారు.