IPL : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై రోహిత్ శర్మ ఫీల్ అయ్యాడు. చివరివరకు తాను క్రీజులో ఉన్నా టీం గెలవకపోవడంతో బాధగా మైదానాన్ని వీడాడు. ఆట ముగిసిన అనంతరం సాధారణంగా ప్లేయర్లందరూ స్నేహపూర్వకంగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రోహిత్ ఎవరికీ షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూంకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.