Homeహైదరాబాద్latest NewsSobhita Dhulipala: కాల్ గర్ల్ గా తెలుగు నటి

Sobhita Dhulipala: కాల్ గర్ల్ గా తెలుగు నటి

శోభితా ధూళిపాళ.. మన తెనాలి అమ్మాయి, తెలుగులో ‘గుఢాచారి’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో శోభిత ధూళిపాళ ఒకరు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ఈ చిన్నది తన కెరీర్‌ను బిజీగా మార్చుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ సినిమాలో శోభిత ధూళిపాళ వేశ్య పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చింది.

తాజాగా ఈ సినిమాలో తన పాత్రపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల శోభిత ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీలో వేశ్యగా నటించింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత, కాల్ గర్ల్‌గా నటించడంపై తన ఫీలింగ్స్ వెల్లడించింది. మంకీ మ్యాన్ ఏప్రిల్ 5న యూఎస్‌ఏలో విడుదల చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నేను సీత అనే వేశ్య పాత్రలో నటించాను. ఈ పాత్ర చేయడం నాకు చాలా గర్వంగా అనిపించిందని చెప్పింది. మూవీలో నా పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఏప్రిల్ 26న ఇండియాలో కూడా విడుదల చేయడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తున్నారు. నా పాత్ర మీకు కూడా నచ్చుతుందని నాకు నమ్మకం ఉందని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img