Homeజాతీయంఅంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్లకు సామాజిక భ‌ద్ర‌త‌

అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్లకు సామాజిక భ‌ద్ర‌త‌

సామాజిక భ‌ద్ర‌త ప్ర‌యోజ‌నం కిద అంగ‌న్ వాడి వ‌ర్క‌ర్లు (ఎడ‌బ్ల్యుడ‌బ్ల్యుఎస్‌), అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్ల (ఎడ‌బ్ల్యు హెచ్ఎస్)లకు కింది ఇన్సూరెన్సుప‌థ‌కాల‌ కింద సామాజిక భ‌ద్ర‌త కల్పించారు.

ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ భీమా యోజ‌న )పిఎంజెజెబివై): 18 నుంచి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సుగ‌ల అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్లు, అంగ‌న్ వాడీ హెల్ప‌ర్ల‌కు పిఎంజెజెబివై కింద రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల జీవిత బీమా క‌వ‌ర్ క‌ల్పించారు (ఇది లైఫ్ రిస్క్‌, ఏ కార‌ణంచేత‌నైనా మ‌ర‌ణానికి వ‌ర్తిస్తుంది)

ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న (పిఎంఎస్‌బివై): అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్లు, అంగ‌న్ వాడీ హెల్ప‌ర్ల‌కు 18నుంచి 59 సంవ‌ల్స‌రాల మ‌ధ్య వారికి పిఎంఎఐస్‌బివై ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌చేశారు.ఇది రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌మాద‌భీమా (ప్ర‌మాద‌బీమా, శాస్వ‌త అంగ‌వైక‌ల్యం, పాక్షిక శాశ్వ‌త అంగ‌వైక‌ల్యానికి ల‌క్ష రూపాయ‌లు)

అంగ‌న్ వాడి కార్య‌క‌ర్త్రి బీమా యోజ‌న (ఎకెబివై) (స‌వ‌రించిన‌ది): ఈ ప‌థ‌కం కింద అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు, అంగ‌న్ వాడీ హెల్ప‌ర్ల‌కు 51 నుంచి 59 సంవ‌త్స‌రాల వ‌యసు మ‌ధ్య వారికి స‌వ‌రించిన ఎకెబివై బీమా ప‌థ‌కాన్ని వ‌ర్తింప చేస్తారు. లైఫ్ క‌వ‌ర్‌కు రూ 30,000లు(ఇది లైఫ్ రిస్క్‌, ఏకార‌ణంతోనైనా మ‌ర‌ణం సంభ‌విస్తే వ‌ర్తిస్తుంది)

అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్లు, అంగ‌న్ వాడీ హెల్ప‌ర్లకు 18నుంచి 59 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సువారికి మ‌హిళ‌ల తీవ్ర అనారోగ్యప్ర‌యోజ‌నాల‌ను రూ 20,000 రూపాయ‌ల వ‌ర‌కు , గుర్తించిన అనారోగ్యాల‌కు సంబంధించి రోగ‌నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు ( ఇన్‌వేసివ్ కాన్స‌ర్‌, మ‌లైన్ ట్యూమ‌ర్‌) బ్రెస్్ట‌, సెర్విక్స్‌, యుటెరి, కార్ప‌స్ ఒవ‌రిస్‌, ఫాలోపియ‌న్ ట్యూబ్‌లు, వాజిన‌ల్ , వుల్వా) వంటివాటికి ప‌రీక్ష‌ల‌కు)అలాగే  వారి పిల్ల‌ల‌కు 9వ‌త‌ర‌గ‌తి, నుంచి 12 వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న వారికి (ఐటిఐ కోర్సుల‌తో స‌హా) చెల్లిస్తారు.

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్లు, అంగ‌న్ వాడీ హెల్ప‌ర్లు 51నుంచి 59 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు వారికి (01.06.2017 నాటికి ) జీవిత బీమాను 30,000రూపాయ‌ల నుంచి రూ 2,00,000 ల‌వ‌ర‌కు పెంచారు.

అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్లు, హెల్ప‌ర్ల‌కు పైన పేర్కొన్న సామాజిక భ‌ద్ర‌తా ఇన్సూరెన్సు ప‌థ‌కాలు ఉన్న‌ప్ప‌టికీ, 2020 ఏప్రిల్ 1 నుంచి పూర్తి ప్రీమియ చెల్లింపు విధానంలోకి వ‌చ్చారు. పిఎంజెజెబివై / పిఎంఎస్‌బివై / ఎకెబివై / ఎఫ్‌సిఐ మొదలైన భీమా పథకాల సమ్మిళిత‌త్వాన్ని 2021 మే 31 వరకు తిరిగి ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ డిఎఫ్‌ఎస్, ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరిది..

మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం కింద ల‌బ్దిపొందిన పిల్ల‌ల‌కు ఆహారం అందుబాటులో ఉండేట్టు మంత్రిత్వ‌శాఖ చ‌ర్య‌లు చేప‌ట్టింది.  కోవిడ్ 19 స‌మ‌యంలో , రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాల‌నాయంత్రాంగాలను ఆహార భ‌ద్ర‌తా అల‌వెన్సు కింద ఆహార ధాన్యాలు, ప‌ప్పులు, నూనెలను(వంట వండ‌డానికి అయ్యే ఖ‌ర్చుతో స‌మాన‌మైన‌వి) అర్హులైన పిల్ల‌లంద‌ర‌కీ పాఠ‌శాల‌లు మూసివేసిన కాలానికి ఇవ్వాల్సిందిగా కోర‌డం జ‌రిగింది. ఇందుకు సంబందించిన విధివిధానాల‌ను సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యింవ‌చ్చు. కోవిడ్ -19 కార‌ణంగా ఏర్ప‌డిన ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా సూచించ‌డం జ‌రిగింది. 

 కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో జ‌న ఔష‌ధి కేంద్రాల‌ను వాడుకున్న మ‌హిళ‌ల‌కు  సంబందించిన గ‌ణాంకాలు:  ప్ర‌ధాన‌మంత్రి  భార‌తీయ జ‌న ఔష‌ధి కేంద్రాల‌(పిఎంబిజెకెలు)ను మ‌హిళ‌లు కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఎంద‌రు వినియోగించుకున్నార‌న్న‌ది లెక్కించ‌డానికి వీలులేనిది ఎందుకంటే, ఔష‌ధాలు కొనుగోలు చేసిన వారి కులం,మ‌తం, ,స్త్రీలా ,పురుషులఆ వారి ఆర్థిక స్థోమ‌త ఏ మిటి వంటి విష‌యాల రికార్డుల‌ను పిఎంబిజెకె ఉంచుకోదు. ఈ కేంద్రాల‌ను ప్ర‌జ‌ల‌కు సుల‌భంగా అందుబాటులో ఉండేట్టు చేయ‌డానికి  మార్చి 2025 నాటికి దేశంలోని అన్ని జిల్లాల‌లో 10,500 పిఎంబిజెకెల‌ను ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌ధానమంత్రి భార‌తీయ జ‌నౌష‌ధి ప‌రియోజ‌న (పిఎంబిజెపి) కింద 6611 పిఎంబిజెకెలు దేశ‌వ్యాప్తంగా 732 జిల్లాల‌లో 18-09-2020 నాటికి ప‌నిచేస్తున్నాయి. డిపార్ట‌మెంట్ ఒక మొబైల్ అప్లికేష‌న్ జ‌నౌష‌ధి సుగ‌మ్ పేరుతో తీసుకువ‌చ్చింది. ఈ డిజిట‌ల్ ప్లాట్‌ఫార‌మ్ ద‌గ్గ‌ర‌లోని పిఎంబిజెకెకు మార్గం చూపుతుంది.గూగుల్ మ్యాప్ ద్వారా ఇది ప‌నిచేస్తుంది.) అలాగే జ‌నౌషిధి మందుల‌ను వెత‌క‌డానికి, ఈ ఉత్ప‌త్తుల‌ను జెనిరిక్‌, బ్రాండెడ్ మందుల‌తో వాటి ఎం.ఆర్.పి మొత్తం ఎంత పొదుపు అవుతున్న‌దో గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఈ స‌మాచారాన్ని కేంద్ర మ‌హిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి శ్రీ‌మ‌తి స్మృతి జుబిన్ ఇరాని ఈరోజు రాజ్య‌స‌భ‌కు ఒక లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img