Homeహైదరాబాద్latest NewsSoftware company : బోర్డు తిప్పేసిన సాఫ్ట్​వేర్​ కంపెనీ.. రోడ్డున పడ్డ 150 మంది ఉద్యోగులు

Software company : బోర్డు తిప్పేసిన సాఫ్ట్​వేర్​ కంపెనీ.. రోడ్డున పడ్డ 150 మంది ఉద్యోగులు

Software company : దేశంలో సాఫ్ట్​వేర్​ కంపెనీ మోసాలు ఎక్కవ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సాఫ్ట్​వేర్​ కంపెనీ బోర్డు తిప్పేసింది. విశాఖ నగరంలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఎల్‌టీడబ్ల్యూ ఐటీ బీపీఓ సర్వీస్ లిమిటెడ్ అనే కంపెనీ బోర్డు తిప్పేసింది. దీనితో దాదాపు 150 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత పది నెలలుగా జీతాలు చెల్లించకుండా యాజమాన్యం ఉద్యోగులను బెదిరిస్తూ, వేధిస్తోంది అని ఉద్యోగులు పేర్కొన్నారు. అయితే జీతాలు అడిగినప్పుడు తమను దుర్భాషలాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా PF కూడా చెల్లించని సాఫ్ట్‌వేర్ కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఆఫర్ లెటర్‌లతో మోసం చేసింది. యాజమాన్యం కార్యాలయం నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుసుకున్న ఉద్యోగులు కార్యాలయాన్ని ముట్టడించారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img