Homeహైదరాబాద్latest NewsSoftware​ ఉద్యోగిని సూసైడ్​

Software​ ఉద్యోగిని సూసైడ్​

– ప్రియుడిపై కోపంతోనే..

ఇదేనిజం, హైదరాబాద్: గూగుల్​ కంపెనీలో పని చేస్తున్న ఓ సాఫ్ట్​ వేర్​ ఉద్యోగిని ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రియుడిపై కోపంతోనే ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) కేపీహెచ్‌బీ పరిధి వన్‌సిటీలోని ఏ బ్లాక్‌లో ఉంటోంది. గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఈమెకు నెల్లూరుకు చెందిన మనోజ్​ ఆన్ లైన్​ డేటింగ్​ యాప్​ ద్వారా పరిచయమయ్యారు. ఇతను మియాపూర్‌లో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం మనోజ్‌ను తన వద్దకి రమ్మని అడగగా తర్వాత వస్తానని చెప్పాడు. అతను రాకపోవడంతో కారులో మియాపూర్‌ బయలుదేరింది. మార్గమధ్యలో మనోజ్‌కు ఫోన్‌ చేసి వసంతనగర్‌ కమాన్‌ వద్ద ఉన్నానని, రాకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతను వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Recent

- Advertisment -spot_img