చెరువు మాది మా మట్టిని మేమే అమ్ముకుంటాం మీరు ఎవరు అంటూ రైతులపై దాడికి పాల్పడ్డ మట్టి మాఫియాను అరికట్టాలి. రైతుల పేరుతో ఇరిగేషన్ శాఖ నుండి పర్మిషన్లు తీసుకొని కమర్షియల్ గా చెరువులో మట్టిని అమ్ముకుంటూ డబ్బులు దండుకుంటున్న మట్టి మాఫియా ను ఇరిగేషన్ అధికారులు అడ్డుకొని రైతులకు మేలు చేయాలని సిపిఎం నాగవరపాడు గ్రామ శాఖ కార్యదర్శి తోక కృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
మధిర మండల పరిధిలోని మాటూరు మాటూరు పేట నాగవరప్పాడు లో మట్టి మాఫియా .. రైతుల పేరు చెప్పి ఇరిగేషన్ శాఖ నుండి అనుమతులు తీసుకొని ఇష్టారాజ్యంగా కమర్షియల్ గా మట్టిని అమ్ముకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ దందా వెనుక అధికారుల నాయకుల హస్తం ఉందని ప్రజలకు తెలుసుకొని అన్నారు. నిజమైన రైతు పొలానికి మట్టి తోలుకోవాలన్నా కూడా ఈ మట్టి మాఫియా పర్మిషన్ తీసుకోవాల్సిందేనా? ఇదే తరహాలో మాటూరు పేట రెవిన్యూ లో నాగవరపు పాడు గ్రామానికి చెందిన వాకధాని శ్రీలేఖకు పంట భూమి ఉంది దీనికి సంబంధించి పొలానికి మట్టి తోలేందుకు ఇరిగేషన్ నుండి అనుమతులు తీసుకున్నారు అయినా కూడా మాటూరు మాటూరు పేట గ్రామానికి చెందిన మట్టి మాఫియా ఈ చెరువులో నుండి మీరు మట్టితోలేందుకు అనుమతి ఇవ్వమని మా చెరువు మా మట్టిని మేమే అమ్ముకుంటాం అంటూ నాగవరప్పాడు రైతులపై దాడికి ప్రయత్నించడం సరైంది కాదు.
ఈ విషయమై ఇరిగేషన్ డి ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు. అధికారులే మాకు తగిన న్యాయం చేయాలి అని నాగవరప్పాడు గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నాగవరపాడు గ్రామ రైతుల సమస్య మాత్రమే కాదు మాటూరు మాటూరు పేట గ్రామాల రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది తాము నిర్ణయించినదే లేటుగా తాము తీసుకొచ్చిన జెసిబి ట్రాక్టర్లు ఉపయోగించే మాత్రమే మట్టి తోలుకోవాలి అని అనడం మాఫియా గా మారిన నాయకుల కమిషన్లు కలిపి పేద రైతులపై భారం పడుతుందని రైతులు తమ పంట పొలాల్లో స్వచ్ఛందంగా మట్టిని తోలుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ మాఫియాను అరికట్టడంలో విఫలమైందని తోక కృష్ణ ఆరోపించారు అధికారులు రైతులకు అండగా నిలబడి చెరువు నుండి సారవంతమైన మట్టిని పొలాల్లోకి తోలుకునేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు