Homeఫ్లాష్ ఫ్లాష్solapur:శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

solapur:శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

solapur:: మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో రోజు పర్యటన కొనసాగుతున్నది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఉదయాన్నే సోలాపూర్‌ నుంచి పండరీపూర్‌ చేరుకున్నారు. పండరీపూర్‌లోని శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు. సీఎం వెంట బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌రావు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

సీఎం ఆలయానికి వెళ్లిన సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పలువురు మరాఠీ భక్తులు సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు.మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు శ‌క్తిపీఠం తుల్జాపూర్ భ‌వానీ ఆల‌యానికి వెళ్లి అమ్మవారిని ద‌ర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్రలోని భార‌త రాష్ట్ర స‌మితి కార్యక‌ర్తలు భారీ స్థాయిలో పండ‌రీపురం చేరుకున్నారు.

కాగా, సీఎం కేసీఆర్‌ సోమవారం హైద‌రాబాద్ నుంచి భారీ ర్యాలీగా మహారాష్ట్రకు బ‌య‌లుదేరి వెళ్లారు. రాత్రి సోలాపూర్‌లో బ‌స చేసి.. ఇవాళ ఉదయం పండరీపూర్‌కు వెళ్లారు. ఆలయ ఉత్తరద్వారం గుండా కేసీఆర్‌ తదితరులు లోపలికి వెళ్లారు. కేసీఆర్‌ దుకాణ సముదాయాల నడుమ నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు కేసీఆర్‌కు శ్రీవిట్టల్‌ రుక్మణీ ప్రతిమను బహూకరించాడు.

Recent

- Advertisment -spot_img