హైదరాబాద్, ఇదేనిజం : బాలాపూర్ గణనాథునికి పూజలు నిర్వహించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. కరోనా వైరస్ నుండి విశ్వ మానవాళిని కాపాడాలని పూజలు చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, పదాధికారులకు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందించారు బాలాపూర్ ఉత్సవ సమితి అధ్యక్షులు నిరంజన్ రెడ్డి సభ్యులు. కోవిడ్19 కారణంగా ఈ సంవత్సరం భాగ్యనగరంలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాన్ని నిర్వహించడంలేదు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ లడ్డూ వేలాన్ని కూడా ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి రద్దుచేసుకుంది.