Homeలైఫ్‌స్టైల్‌Gray Hair : తెల్ల వెంటుక‌లు న‌ల్ల‌గా మారేందుకు ఈ పొడిని ట్రై చేయండి

Gray Hair : తెల్ల వెంటుక‌లు న‌ల్ల‌గా మారేందుకు ఈ పొడిని ట్రై చేయండి

Gray Hair : తెల్ల వెంటుక‌లు న‌ల్ల‌గా మారేందుకు ఈ పొడిని ట్రై చేయండి

Gray Hair – వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల ఎవ‌రికైనా స‌రే స‌హ‌జంగానే జుట్టు తెల్ల‌గా అవుతుంటుంది.

అది అత్యంత స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. అయితే కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా అవుతుంది.

ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.

కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ జుట్టు తెల్ల‌బ‌డ‌డం అనేది చాలా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది.

జుట్టు తెల్ల‌గా ఉన్న‌వారు న‌ల్ల‌గా మారేందుకు మార్కెట్‌లో ల‌భించే అనేక ర‌కాల హెయిర్ డై ల‌ను వాడుతుంటారు.

వాటి వ‌ల్ల జుట్టు అప్ప‌టిక‌ప్పుడు న‌ల్ల‌గా మారినా.. వాటిని దీర్ఘ‌కాలికంగా వాడితే ఇబ్బందులు త‌ప్ప‌వు.

అయితే ఎలాంటి దుష్ప‌రిణామాలు లేకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో ఒక పొడిని త‌యారు చేసుకుని దాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడం వ‌ల్ల తెల్ల‌గా ఉన్న జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

మ‌రి ఆ పొడిని ఎలా త‌యారు చేయాలంటే..

ఉసిరిక పెచ్చులు మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తాయి. లేదా ఉసిరికాయల మీద గుజ్జు తీసి ఎండ‌బెట్ట‌వ‌చ్చు.

అనంత‌రం వాటిని పొడి చేయాలి. లేదా మార్కెట్‌లో నేరుగా ఉసిరిక పొడి కూడా ల‌భిస్తుంది.

దాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక క‌రివేపాకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి ఎండ‌బెట్టి పొడి చేయాలి.

అనంత‌రం ఈ రెండు పొడిల‌ను 25, 25 గ్రాముల చొప్పున తీసుకుని బాగా క‌లిపి ఒక సీసాలో నిల్వ చేయాలి.

దాన్ని రోజూ ఉద‌యం, సాయంత్రం 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో తీసుకుని అంతే మోతాదులో తేనెతో క‌లిపి భోజ‌నానికి అర గంట ముందు సేవించాలి.

ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ పొడిని తీసుకుంటుంటే.. తెల్ల‌గా ఉన్న జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

ఉసిరికాయ‌లు, క‌రివేపాకుల్లో ఉండే అనేక ర‌కాల విట‌మిన్లు జుట్టు పెరుగుద‌లకు దోహ‌దం చేస్తాయి.

దీంతోపాటు జుట్టు స‌మ‌స్య‌లు కూడా పోతాయి. శిరోజాలు న‌ల్ల‌గా మారుతాయి.

కాబ‌ట్టి వీటితో త‌యారు చేసిన పొడిని పైన చెప్పిన విధంగా క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి

ఒత్తయిన కురులు మీ సొంతం కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..

ఎన్ని చేసినా జుట్టు రాలుతుందా..? ఈ చిన్న టిప్ ట్రై చేయండి..

ఒత్తైన జుట్టు కోసం ఈ షాంపూ..

Recent

- Advertisment -spot_img