ఇదేనిజం, లక్షెట్టిపేట: పట్టణంలో రోడ్ల సమస్యను తీర్చాలని యూత్ నాయకుడు మారుషెట్టి సుమన్ కమిషనర్ ను కోరారు. శుక్రవారం యూత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని 9 వార్డ్ లొ వర్షం కారణంగా పలు చోట్ల డ్రైనేజీ,గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే మార్గం డ్రైనేజీ సదుపాయం లేక డ్రైనేజీ నీరు రోడ్డు పైన చేరుతుందన్నారు. ప్రజలు డెంగీ, మలేరియా బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై కమీషనర్ దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలొ స్థానిక యూత్ నాయకులు దర్శనాల వంశీ, దర్శనాల జనార్దన్, అవునూరి కిరణ్, రవితేజ, ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు.