Homeహైదరాబాద్latest NewsTSPSCలో కొన్ని లింకులు MISS: సిట్

TSPSCలో కొన్ని లింకులు MISS: సిట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసుపై సిట్ అడిషనల్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. TSPSC కేసులో కొన్ని లింకులు మిస్సయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవరేం చేశారు? ఎవరి పాత్ర ఎంత వరకు ఉంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.

ప్రస్తుతం తమ దర్యాప్తు ఈ అంశాల చుట్టూ తిరుగుతోందని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని వివరాలతో మీడియా ముందుకు వస్తామని అడిషనల్ కమిషనర్ తెలిపారు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని, ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోందని, ఇంకా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img