ఇదేనిజం, వెబ్డెస్క్ : కాలం మారిందా? సీన్ రివర్స్ అయిందా? ఒకప్పుడు జెంట్స్ చూస్తే లేడీస్ ఇబ్బందిపడే రోజులుపోయి సీన్ మారినట్లుంది. బస్సులు, మెట్రో ట్రైన్, షాపింగ్ కాంప్లెక్సులు..ఇలా ఎక్కడ చూసినా కొందరు అమ్మాయిలు హ్యాండ్సమ్ గాయ్స్ వెంట పడుతున్నారట. నడుస్తుంటే దూరం నుంచే తమ కళ్లతో క్లిక్మనిపిస్తూ ఓ అంచనాకు వస్తున్నారట. ఇష్టం ఉన్నా, నచ్చినా ఈగోతో పక్కకు నిలబడి కనుగుడ్లను తమవైపు తిప్పి చూస్తున్నారంటూ కొందరు హ్యాండ్సమ్ గాయ్స్ చెబుతున్నారు. తమకు ఇబ్బందేమీ లేకపోయినా మరీ ఇంతలా తెగిస్తున్నారేంటని నవ్వుకుంటున్నారు. ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఇంట్రోవర్ట్స్కి ఇది నచ్చడం లేదట. ఆ కళ్లతో ఫొటోలు తీస్తుంటే ఫోజులు ఇవ్వలేక సిగ్గుతో తలదించుకుంటున్నారట. హుషారుగా ఉన్నవాళ్లయితే తెగ ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.